Saturday, April 19, 2025

రాజస్థాన్ టార్గెట్ 189

- Advertisement -
- Advertisement -

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 18వ సీజన్‌లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ మొదట టాస్ గెలిచి రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్(49: 37 బంతుల్లో 5 ఫోర్లు,1 సిక్స్)పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.కిందటి మ్యాచ్‌లో విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరించిన కరుణ్ నాయర్ ఈసారి ఖాతా తెరవకుండానే రనౌట్‌గా వెనుదిరిగాడు. సీనియర్ ఆటగాడు రాహుల్ 38 పరుగులు సాధించాడు. ధాటిగా ఆడిన స్టబ్స్ 18 బంతుల్లోనే రెండు సిక్స్‌లు, 2 ఫోర్లతో 34 పరుగులు చేశాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన అక్షర్ పటేల్ 14 బంతుల్లోనే 34 పరుగులు సాధించాడు. అశుతోష్ శర్మ 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.రాజస్థాన్ బౌలర్స్ లో అర్బర్ 2, తీక్షణ, హాసరంగా చెరో వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News