Wednesday, January 22, 2025

ఆత్మవిశ్వాసంతో రాజస్థాన్

- Advertisement -
- Advertisement -

నేడు ఢిల్లీతో పోరు
జైపూర్: గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే పోరుకు రాజస్థాన్ రాయల్స్ సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ విజయమే లక్షంగా పెట్టుకుంది. ఇక తొలి మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఓడిన ఢిల్లీకి ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఈమ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేయాలనే పట్టుదలతో ఢిల్లీ కనిపిస్తోంది. ఇక తొలి మ్యాచ్‌లో లక్నోను అలవోకగా ఓడించిన రాజస్థాన్ ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తోంది. కెప్టెన్ శాంసన్ ఫామ్‌లో ఉండడం రాజస్థాన్‌కు కలిసివచ్చే అంశంగా చెప్పాలి. ఎలాంటి బౌలింగ్‌నైనా చిన్నాభిన్నం చేసే సత్తా కలిగిన శాంసన్ తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే ప్రత్యర్థి బౌలర్లకు కష్టాలు ఖాయం.

ఐపిఎల్ శాంసన్‌కు చక్కటి రికార్డు ఉండడం కూడా రాజస్థాన్‌కు సానుకూలా పరిణామమే. జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్‌ల రూపంలో విధ్వంసక బ్యాటర్లు జట్టులో ఉన్నారు. ఆరంభ మ్యాచ్‌లో వీరిద్దరూ బాగానే ఆడినా భారీ స్కోర్లను సాధించడంలో విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా బ్యాటింగ్ చేయాలని భావిస్తున్నారు. ఇటీవల కాలంలో యశస్వి అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో పరుగుల వరద పారించాడు. ఐపిఎల్‌లోనూ అదే జోరును కొనసాగించాలనే లక్షంతో కనిపిస్తున్నాడు. మరోవైపు ప్రపంచంలోని అత్యంత విధ్వంసక బ్యాటర్లలో ఒకరిగా పేరున్న బట్లర్, హెట్‌మెయిర్‌ల రూపంలో రాజస్థాన్‌కు పదునైన అస్త్రాలు ఉండనే ఉన్నాయి.

బట్లర్, హెట్‌మెయిర్‌లు చెలరేగితే ఈ మ్యాచ్‌లో కూడా రాజస్థాన్‌కు భారీ స్కోరు ఖాయం. రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, అశ్విన్‌లతో రాజస్థాన్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. తొలి మ్యాచ్‌లో బట్లర్, హెట్‌మెయిర్ తప్ప మిగతా బ్యాటర్లు బాగానే ఆడారు. ఈ మ్యాచ్‌లోనూ బ్యాటర్లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అంతేగాక ట్రెంట్ బౌల్ట్, చాహల్, అవేశ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్‌ల రూపంలో మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టులో ఉన్నారు. తొలి మ్యాచ్‌లో బౌలర్లు సమష్టిగా రాణించారు. ఈసారి కూడా బౌలర్లపై జట్టు భారీ ఆశలే పెట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉన్న రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. దీంతో పాటు సొంత గడ్డపై మ్యాచ్ జరుగుతుండడం కూడా రాజస్థాన్‌కు అతి పెద్ద ఊరటనిచ్చే అంశమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News