Monday, January 20, 2025

రాజస్థాన్ రాయల్స్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్ రద్దు

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ సీజన్17లో రాజస్థాన్ రాయల్స్‌కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. ఆదివారం సాయంత్రం గౌహతి నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో బర్సపారా స్టేడియం తడిసి ముద్దయ్యింది. మైదానం మొత్తం చిత్తడిగా మారడంతో రాత్రి 10.30 గంటల వరకు కూడా మ్యాచ్ ఆరంభం కాలేదు. కాగా, ఈ మ్యాచ్ రద్దయితే రాజస్థాన్ మూడో స్థానంతో సరిపెట్టుకోక తప్పదు. ప్రస్తుతం కోల్‌కతా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక ఆదివారం పంజాబ్‌పై గెలిచిన హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News