Monday, December 23, 2024

ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ విజయం

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఐపిఎల్‌లో భాగంగా బుధవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ 3 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 52, పడిక్కల్ ఐదు బౌండరీలతో 38 పరుగులు చేశారు. అశ్విన్ (30), హెట్‌మెయిర్ 30 (నాటౌట్) కూడా మెరుగైన బ్యాటింగ్‌తో అలరించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 172 పరుగులు చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. డెవోన్‌కాన్వే (50), రహానె (31), జడేజా 25 (నాటౌట్), ధోనీ 32 (నాటౌట్) రాణించినా ఫలితం లేకుండా పోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News