Monday, December 23, 2024

ముంబై ఇండియన్స్ పై రాజస్థాన్ విజయం

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ సీజన్17లో రాజస్థాన్ రాయల్స్ జట్టు సంచనం సృష్టిస్తోంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్ర భాగానికి చేరుకుంది. సోమవారం ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అలవోకగా విజయం సాధించింది. అటు బౌలింగ్, బ్యాటింగ్‌లలో సమష్టిగా రాణించిన రాజస్థాన్ 6 వికెట్ల తేడా విజయం సాధించింది. రాజస్థాన్ బ్యాటింగ్‌లో రియాన్ పరాగ్ 54( 39 బంతులు; 5×4 3×6)తో బ్యాట్ ఝలిపించడంతో 15.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సునయాస విజయం నమోదు చేసింది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబై బ్యాటర్లలో రాజస్థాన్ బౌలర్ల ధాటికి వరుసగా ముగ్గురు బ్యాటర్లు రోహిత్ శర్మ, నామన్ ధీర్, డివాల్డ్ బ్రేవీస్ డకౌట్ అయ్యి పెవిలియన్ చేరారు. దీంతో తిలక్ వర్మ(32), హార్ధిక్ పాండ్య(34) రాణించిన ముంబై గౌరవపదమైన స్కోరు చేయడంలో విఫలమై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 125 పరగులు మాత్రమే చేసింది. రాజస్థాన్ బౌలర్లలో బౌల్డ్, చాహల్ మూడేసి వికెట్లు పడగొట్టగా బర్గర్ రెండు, అవేశ్ ఖాన్ ఒక వికెట్ దక్కించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News