Thursday, January 23, 2025

సామూహిక అత్యాచారం…. రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థిని చనిపోయిందని….

- Advertisement -
- Advertisement -

జైపూర్: ఇంటర్ చదువుతున్న విద్యార్థినిపై ముగ్గురు సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిదని నమ్మించిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని సికార్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బాలిక తండ్రి సౌదీ అరేబియాలో ఉంటుండడంతో బాలిక తన తాతయ్యతో కలిసి ఉంటుంది. ముగ్గురు యువకులు బాలిక బంధువులకు ఫోన్ చేసి సదరు యువతి రోడ్డు ప్రమాదంలో గాయపడిందని ఆస్పత్రిలో చేర్పించామని కబురు పంపారు.

Also Read: ఏందప్పా.. 92లోనూ..

వెంటనే బంధువులు అక్కడికి చేరుకునేసరికి బాలిక మృతి చెంది ఉండడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో మేనమామ ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేయకుండా తాత్సారం చేయడంతో స్థానికులు ధర్నాకు దిగారు. నిందితులు బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారని, వారికి రాజకీయంగా పలుకుబడి ఉండడంతో పోలీసులకు కేసు నమోదు చేయడం లేదని స్థానికులు, మృతురాలి బంధువుల ఆందోళనకు దిగారు. ఆందోళన ఉధృతం కావడంతో రాత్రి పది గంటల సమయంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News