Sunday, December 22, 2024

కన్న కూతురిని కొట్టి చంపేసిన తండ్రి

- Advertisement -
- Advertisement -

సరిగ్గా చదవడం లేదని కన్న కుమార్తెనే కొట్టి చంపేశాడొక తండ్రి. దారుణమైన ఈ సంఘటన రాజస్థాన్ లోని సిరోహి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రేమ్ నగర్ కు చెందిన ఫతే మహ్మద్ కుమార్తె 11వ తరగతి చదువుతోంది. పరీక్షలు దగ్గరపడినా ఆమె చదవడం లేదనే కోపంతో కూతుర్ని కర్రతో చావగొట్టాడు. దాంతో ఆ బాలిక అక్కడికక్కడే కన్నుమూసింది. బాలిక మామ ఫిర్యాదు మేరకు పోలీసులు ఫతే మహ్మద్ ను అరెస్టు చేశారు. బాలిక మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News