Monday, January 20, 2025

రాజస్థాన్ లక్ష్యం 190

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఐపిఎల్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్‌సిబి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ఆర్‌ఆర్ ముందు 190 పరుగుల లక్ష్యాన్ని ఆర్‌సిబి ఉంచింది. డూప్లిసెస్, మ్యాక్స్‌వెల్ హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు సింగల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దినేష్ కార్తీక్ 13 బంతుల్లో 16 పరుగులు చేశాడు.

రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, సందీప్ శర్మ చెరో రెండు వికెట్లు, అశ్విన్, చాహాల్ చెరో ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం రాజస్థాన్ ఐదు ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 36 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. సిరాజ్ బౌలింగ్‌లో జోస్ బట్లర్ పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో యశస్వి జైస్వాల్(20), దేవ్‌దూత్ పడిక్కల్ (21) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News