Saturday, December 21, 2024

పేపర్ లీకేజీకి పాల్పడితే.. ఇక జీవితాంతం జైల్లోనే

- Advertisement -
- Advertisement -

జైపూర్ : ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రశ్నా పత్రాల లీకేజీని అడ్డుకునేందుకు రాజస్థాన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లీకేజీకి పాల్పడిన వారికి ప్రస్తుతమున్న 10 ఏళ్ల నుంచి జీవిత ఖైదు విధించడానికి సిద్ధమైంది. ఈమేరకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును తీసుకురాడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ట్విటర్ వేదికగా వెల్లడించారు.

2021 సెప్టెంబర్‌లో నిర్వహించిన ఆర్‌ఈఈటీ లెవల్ 2 ప్రశ్నాపత్రం లీకేజీ కారణంగా రద్దయింది. ఈ లీకేజీని అరికట్టడానికి రాజస్థాన్ ప్రభుత్వం గత ఏడాది ఓ బిల్లును ఆమోదించింది. లీకేజీకి పాల్పడితే 10 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే బిల్లుకు 2022 మార్చిలో ఆమోదం తెలిపింది. తాజాగా ఆ శిక్షను మరింతగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News