Sunday, January 19, 2025

గెలిచి నిలిచిన రాజస్థాన్..పంజాబ్ ఔట్

- Advertisement -
- Advertisement -

ధర్మశాల: ఐపిఎల్ సీజన్16 ప్లేఆఫ్ రేసు నుంచి పంజాబ్ కింగ్స్ నిష్క్రమించింది. శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ నాలుగు వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. ఈ విజయంతో రాజస్థాన్ తన ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఇరు జట్లు హోరాహోరీగా పోరాడాయి. చివరికి రాజస్థాన్‌కు విజయం వరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 187 పరుగులు చేసింది.

సామ్ కరణ్ 49 (నాటౌట్), జితేష్ కుమార్ (44), షారుక్ ఖాన్ 41 (నాటౌట్) మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచారు. తర్వాత లక్షఛేదనకు దిగిన రాజస్థాన్ 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (50), దేవ్‌దుత్ పడిక్కల్ (51), హెట్‌మెయిర్ (46), రియాన్ పరాగ్ (20) రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News