Wednesday, January 22, 2025

బెంగళూరుపై రాజస్థాన్ గెలుపు

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్‌గా దిగిన విరాట్ కోహ్లి అజేయ శతకంతో జట్టును ఆదుకున్నాడు. చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి 72 బంతుల్లోనే 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి కెప్టెన్ డుప్లెసిస్ అండగా నిలిచాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన డుప్లెసిస్ 2 ఫోర్లు, రెండు సిక్సర్లతో 44 పరుగులు చేశాడు.

ఈ క్రమంలో కోహ్లితో కలిసి తొలి వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 19.1 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ జోస్ బట్లర్ అజేయ శతకంతో జట్టును గెలిపించాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన బట్లర్ 58 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతనికి కెప్టెన్ సంజూ శాంసన్ అండగా ఉన్నాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన శాంసన్ 42 బంతుల్లోనే 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో 69 పరుగులు సాధించాడు. ఇదే సమయంలో బట్లర్‌తో కలిసి రెండో వికెట్‌కు 148 పరుగులు జోడించాడు. కాగా, బెంగళూరు ఈ సీజన్‌లో నాలుగో పరాజయాన్ని చవిచూసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News