Monday, January 20, 2025

పాకిస్తాన్ నుంచి అంజూ వచ్చేసింది!

- Advertisement -
- Advertisement -

అంజూ గుర్తుందా? ఫేస్ బుక్ లో పరిచయమైన కుర్రాడిని పెళ్లి చేసుకునేందుకు భర్తనీ, పిల్లలనీ వదిలి పాకిస్తాన్ వెళ్లిన భారత యువతి అంజూ (34) ఉదంతం ఆ మధ్య సంచలనం సృష్టించింది. నస్రుల్లా అనే పాకిస్తానీ యువకుడితో అంజూ చాలాకాలం ఫేస్ బుక్ లో స్నేహం కొనసాగించింది. ఆ స్నేహం కాస్తా ప్రేమలోకి దింపింది. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ కి చెందిన అంజూకి అప్పటికే పెళ్లయి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

అయినా వారిని కాదనుకుని పాకిస్తాన్ వెళ్లిపోయింది. నస్రుల్లాని పెళ్లాడేందుకు ముస్లిం మతం స్వీకరించి, తన పేరును ఫాతిమాగా మార్చుకుంది. నిజానికి నస్రుల్లా ఆమెకంటే వయసులో చిన్నవాడు. అయితే ఆవేశంలో తాను తీసుకున్న నిర్ణయం వల్ల భర్త, పిల్లలు దూరం కావడాన్ని అంజూ తట్టుకోలేకపోయింది. పిల్లలపై బెంగతో దిగులుపడింది. దాంతో నస్రుల్లా ఆమెను పాక్ సరిహద్దుల్లోని వాఘా వద్ద విడచిపెట్టాడు. అంజూ మానసిక వేదనతో బాధపడుతోందనీ, పిల్లలపై బెంగ పెట్టుకుందనీ నస్రుల్లా చెప్పాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News