Monday, December 23, 2024

కూతురిని తల్లి గొడ్డలితో నరికి… బావిలో పడేసింది

- Advertisement -
- Advertisement -

 

జైపూర్: లవర్‌తో మాట్లాడుతుందని తల్లి తన కుమారుడితో కలిసి కూతురిని గొడ్డలితో నరికి చంపిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం అజ్మేర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. శాంతి బేగమ్ అనే మహిళ తన కూతురు సోను, కుమారుడి హనీఫ్‌తో కలిసి జీవనం సాగిస్తోంది. మనిపూర్ అటవీ ప్రాంతంలో ఎప్రిల్ 29న యువతి మృతదేహం బావిలో కనిపించిడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మూడు రోజుల తరువాత తన సోనూకనిపించడంలేదని ఆమె బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Also Read:  చిత్తూరులో కుమారుడిని చంపి… మామిడి తోటలో పాతిపెట్టాడు

మృతదేహం సోనూదని కుటుంబ సభ్యులు గుర్తించడంతో పాటు ఆమెపై అత్యాచారం చేసి చంపేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేశారు. తల్లి, కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా విచారణలో ఇద్దరు వేర్వేరు సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానాలు వ్యక్తం చేశారు. వెంటనే వారిని తనదైన శైలిలో అడగడంతో తామే హత్య చేశామని ఒప్పుకున్నారు. సోను తన లవర్‌తో ఫోన్‌లో మాట్లాడుతుండడంతో ఆమెను గొడ్డలితో నరికి చంపేసి బావిలో పడేశామని వివరణ ఇచ్చారు. వెంటనే వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని పోలీసులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News