Tuesday, November 5, 2024

కెఆర్‌ఎంబి మార్గదర్శకాలు.. బచావత్‌కు విరుద్ధం

- Advertisement -
- Advertisement -
Rajat Kumar letter to KRMB Chairman
కెఆర్‌ఎంబి చైర్మన్‌కు ఇరిగేషన్ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రజత్‌కుమార్ లేఖ

మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మార్గదర్శకాలు బచావత్ ట్రైబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. కృష్ణానది నిర్వహణ బోర్డు (కెఆర్‌ఎంబి) గెజిట్ నోటిఫికేషన్ అమల్లో భాగంగా ప్రాజెక్టుల స్వాధీనం, నిర్వహణకు సంబంధిత అభ్యంతరాలను పేర్కొంటూ గురువారం కెఆర్‌ఎంబి చైర్మన్ ఎంపి సింగ్‌కు తెలంగాణ నీటిపారుదల శా ఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రజత్‌కుమార్ లేఖ రాశారు. ప్రాజెక్టుల స్వాధీనం కోసం కేఆర్‌ఎంబీ ప్రతిపాదనల్లోని నియమ నిబంధనలు, నిర్వహణ పద్దతులు (రూల్ కర్వ్, ఆపరేషన్ ప్రొటోకాల్స్)పై నిపుణుల కమిటీ ఈ నెల 20న పరిశీలించిందన్నారు. బోర్డు మార్గదర్శకాలు అన్నీ బచావత్ ట్రైబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఉన్నట్లు సమావేశం ఏకగ్రీవంగా అభిప్రాయపడిందన్నారు.

కృ ష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ 1 (బచావత్ అవార్డు)లోని పేజీ నం.104పై మీ దృష్టికి తెస్తున్నాం… ‘శ్రీశైలం ప్రాజెక్టు నీటిని మరో బేసిన్‌కు మళ్లించకుండా విద్యుత్ ఉత్పత్తి చేసే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కావడంతో అవిరి నష్టం తప్ప నీటి వినియోగం ఉండదు’ అని అవార్డులో పేర్కొన్నారని వెల్లడించారు. ఈ నిబంధనలను పునర్ నిర్వచిం చే అధికారం కెఆర్‌ఎంబికి, కేంద్రానికి లేదన్నారు. కృషా నీటి కేటాయింపులు కెఆర్‌ఎంబి-2లో పరిశీలనలో ఉంది. నదీ జలాల కేటాయింపులను కెఆర్‌ఎంబి మొదటి అవార్డును అనుసరించాలని లేఖలో స్పష్టం చేశారు.బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ అవార్డు అమల్లోకి వచ్చే వరకు బచావత్ ట్రైబ్యునల్ అవార్డును పూర్తిస్థాయిలో పాటించాల్సిందేనన్న రజత్‌కుమార్ కోరారు. అంతర్రాష్ట్ర ఒప్పందం.. ప్రణాళికా సంఘం ఆమోదం ప్రకారం శ్రీశైలం జలాశయం నుంచి ఎపి కేవలం 34 టీఎంసీల నీటిని మాత్రమే తీసుకోవాలన్నారు.

సగటు వినియోగం గణాంకాల కోసం 2014-15 నుంచి ఏడేళ్ల సగటును తీసుకోవడం బచావత్ అవార్డుకు విరుద్ధమని పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రె గ్యులేటర్, హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా అక్రమంగా బేసిన్ వెలుపల కు నీటిని తరలిస్తున్న ఎపి వాదనకు బలం చేకూర్చినట్లవుతుందన్నారు. పరీవాహక ప్రాంతం లేకున్నా రెండు రాష్ట్రాల తాగు, పారిశ్రామిక అవసరాలకు నాగార్జునసాగర్ కీలకమని రజత్‌కుమార్ అభిప్రాయపడ్డారు. శ్రీశైలం నుంచి దిగువకు నీరు విడుదల చేస్తేనే సాగర్‌కు జలాలు వస్తాయని, దీంతో రెండు ప్రాజెక్టులకు సమీకృతంగా నియమ వక్రతలు, నిర్వహణ పద్ధ తులు అవసరమన్నారు. బచావత్ అవార్డు ప్రకారం రెండు జలాశయాల్లో నూ క్యారీ ఓవర్ స్టోరేజ్‌కు నిబంధనలు లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News