Thursday, January 23, 2025

గాయంతో శ్రేయస్ అయ్యర్ ఔట్… రజత్ పాటిదర్ ఇన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడడంతో న్యూజిలాండ్‌తో ఆడుతున్న వన్డే సిరీస్‌కు దురమయ్యాడు. వెన్నెముకకు గాయం కావడంతో అతడు సిరీస్ నుంచి దూరంగా ఉన్నాడని బిసిసిఐ వెల్లడించింది. శ్రేయస్ అయ్యర్ స్థానంలో రజిత్ పాటిదార్ భారత జట్టులోకి చోటు కల్పించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు హైదరాబాద్‌కు చేరుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు.
భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), హార్ధిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రజత్ పాటిదర్, షాబాజ్ అహ్మద్, శార్థూల్ ఠాకూర్, మహహ్మద్ షమి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News