Thursday, January 23, 2025

కోహ్లీకి రీప్లేస్ అతడేనా?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. దీంతో అతడిని రీప్లేస్ చేసేది ఎవరూ అంటూ సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. విరాట్ స్థానంలో రింకూ సింగ్, రజత్ పటీదార్ తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. రింకూ సింగ్ టి20ల్లో మంచి ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

టి20లు, టెస్టులు వేర్వేరు కావడంతో క్రీజులో ఎక్కువ సేపు ఉండే ఆటగాడి వైపు మొగ్గు చూపాలని బిసిసిఐ భావిస్తోంది. రజత్ పటీదార్ ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లాండ్ లయన్స్- భారత్-ఎ అనధికార టెస్టులో రజత్ 150 పరుగులు చేయడంతో పాటు వార్మప్ మ్యాచ్‌లో 111 పరుగులు చేశాడు. రజత్ 55 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 45.97 సగటుతో 12 శతకాలతో 4000 పరుగులు చేశాడు. 2021-22లో మధ్యప్రదేశ్ జట్టు రంజీ ట్రోఫీ గెలవడంతో రజత్ కీలక పాత్ర పోషించాడు. రహానె, పుజారాను జట్టులోకి తీసుకోవడానికి సెలక్షన్ కమిటీ ఆసక్తి చూపడం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News