- Advertisement -
హైదరాబాద్: ఈ సీజన్ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ గా రజత్ పాటిదార్ ను యాజమాన్యం ప్రకటించింది. 2021 నుంచి ఆర్ సిబి జట్టుకు రజత్ ఆడుతున్నారు. 27 మ్యాచ్‌ల్లో 799 పరుగులు చేశారు. వేలానికి ముందు 11 కోట్లకు రజత్ ను ఆర్ సిబి రిటెయిన్ చేసుకుంది. 2022, 2024వ సంవత్సరంలో ఆర్ సిబి జట్టుకు కెప్టెన్ గా డూప్లిసెస్ వ్యవహరించారు. గతంలో ఆర్ సిబి జట్టుకు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ 2011 నుంచి 2021, 2023 వరకు సేవలందించారు. ఆర్ సిబి జట్టుకు రాహుల్ ద్రావిడ్(2008), పీటర్సన్(2009), అనిల్ కుంబ్లే(2009-2010), వేటోరి(2011-2012), షేన్ వాట్సన్(2017)లు కెప్టెన్లుగా ఉన్నారు.
- Advertisement -