హైదరాబాద్ : గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పెండింగ్ బిల్లుల వివాదం నడుస్తోన్న క్రమంలో ఈ విషయంపై రాజ్‌భవన్ స్పందించి సోమవారం క్లారిటీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో లేవని వివరించింది. గతంలోనే 3 బిల్లులను గవర్నర్ ఆమోదించారని, మరో 2 బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపారని తెలిపింది. మిగిలిన బిల్లులపై వివరణ కోరుతూ రాష్ట్ర ప్రభు త్వానికి పంపించారని రాజ్‌భవన్ స్పష్టం చేసింది.
ఇటీవల ప్రధాని మోడీ వరంగల్ పర్యటన సందర్భంగా బిల్లులు పెండింగ్‌లో పెట్టిన గవర్నర్‌కు మోడీ ఓ మాట చెబితే బాగుండేదని కెటిఆర్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో రాజ్‌భవన్ పైవిధంగా స్పందించింది. మరో వైపు ప్రభుత్వ బిల్లులను ఆమో దించకుండా యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీని అడ్డుకుంటున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ప్రధాని మోడీ ఒక మాట చెబితే బాగుండేదని కెటి ఆర్ ఇటీవల విమర్శించారు. ఈ విమర్శలపైనే రాజ్ భవన్ స్పందించినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.