Thursday, January 9, 2025

‘ఎఐ’తో ఉద్యోగాలు పోతాయనడంలో అర్థం లేదు

- Advertisement -
- Advertisement -

చెన్నై : కృత్రిమ మేథతో దేశంలోని అన్ని ఉద్యోగాలు ఊడిపోతాయనడం అర్థం లేని వ్యాఖ్యలని కేంద్ర ఎలెక్ట్రానిక్స్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఈరోజు కృత్రిమ మేథ లక్షం కేంద్రీకృత వ్యవస్థగా, మరింత సమర్ధవంతంగా లక్షాలను సాధించే సాంకేతిక శక్తిగా, మానవ ప్రవర్తనను అనుకరిస్తూ తోడ్పడుతుందన్న విషయం మరిచిపోరాదన్నారు. దీనిపై విరక్తిగా మాటలు వినరావడం విచారకరమన్నారు.

1999లో మొత్తం వై2 కె ప్రపంచాన్ని తుడిచిపెట్టిపోతుందన్న వ్యాఖ్యలు వినిపించాయన్నారు. ఏ నూతన ఆవిష్కరణ వచ్చినా కొందరు ఇలాంటి అర్ధం లేని వ్యాఖ్యలు చేస్తుంటారని విమర్శించారు. సొసైటీ ఫర్ అప్లయిడ్ మైక్రోవేవ్ ఎలెక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చి లేబొరేటరీస్‌లో పూర్తి ఆటోమేటెడ్ ఎలెక్ట్రోమేగ్నెటిక్ వ్యవస్థ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఈ వ్యవస్థను ఆయన ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News