కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సోమవారం కేరళ బిజెపి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.పార్టీ కేంద్ర పరిశీలకుడు ప్రహ్లాద్ జోషి బిజెపి రాష్ట్ర మండలి సమావేశంలో ఈ ప్రకటన చేశారు. బిజెపి అధ్యక్ష పదవికి చంద్రశేఖర్ ఆదివారం రెండు సెట్ల నామినేషన్ పత్రాలను బిజెపి ప్రధాన కార్యాలయంలో దాఖలు చేశారు. చంద్రశేఖర్ నియామకాన్ని ప్రకటించేప్పుడు దిగిపోతున్న పార్టీ అధ్యక్షుడు కె.సురేంద్రన్, కేరళ రాష్ట్రానికి చెందిన ప్రముఖ బిజెపి నాయకులు, కేరళ పార్టీ ఇన్‌ఛార్జీ ప్రకాశ్ జావదేకర్ ఉన్నారు. సురేంద్రన్ తన ప్రసంగంలో గత 10 ఏళ్లలో కేరళలో బిజెపి గణనీయ అభివృద్ధిని సాధించిందన్నారు. రాజీవ్ చంద్రశేఖర్ మూడుసార్లు కర్ణాటక రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. అంతేకాక బిజెపి జాతీయ ప్రతినిధిగా పనిచేశారు. పైగా ఆయన కేరళ ఎన్‌డిఎ యూనిట్‌కు వైస్‌చైర్మన్‌గా ఉన్నారు. గుజరాత్‌లోని కేరళ తల్లిదండ్రులకు ఆయన జన్మించారు. కానీ ఆయన కుటుంబ మూలాలు త్రిస్సూర్‌కు చెందినవి. చంద్రశేఖర్ మామగారు టిపిజి నంబియార్ బిపిఎల్ గ్రూప్ వ్యవస్థాపకుడు.
కేరళ బిజెపి నూతన అధ్యక్షుడిగా రాజీవ్ చంద్రశేఖర్ ఎన్నిక
- Advertisement -
- Advertisement -
- Advertisement -