Tuesday, January 21, 2025

లాల్‌దర్వాజా సింహవాహిణి ఆలయ చైర్మన్‌గా రాజేందర్ యాదవ్

- Advertisement -
- Advertisement -

చాంద్రాయణగుట్ట: తెలంగాణాలోనే చారిత్రక ప్రసద్ధిగాంచిన లాల్‌దర్వాజా సింహవాహిణి మహంకాళి దేవాలయ నూతన చైర్మన్‌గా మేకలబండ నివాసి, మాజీ కార్పొరేటర్ సి.రాజేందర్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. ఆలయ ఫోర్‌మెన్ కమిటీ చైర్‌పర్సన్లు సి.శివకుమార్ యాదవ్, పోసాని సురేందర్ ముదిరాజ్, శీరా రాజ్‌కుమార్, ఎ.బద్రినాథ్‌గౌడ్, సలహాదారులు కాశీనాథ్‌గౌడ్ అధ్యక్షతన ఆదివారం ఆలయ ప్రాంగణంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో వచ్చే ఆషాఢ బోనాల ఉత్సవాలకు కొత్త కమిటీని ఎన్నుకున్నారు.

కన్వీనర్‌గా గౌని అరవింద్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా బి. మారుతి యాదవ్, కోశాధికారిగా పోసాని సదానంద్ ముదిరాజ్‌లు నియమితులైయ్యారు. పూర్తిస్థాయి కమిటీని త్వరలో ప్రకటించనున్నారు. కొత్తగా ఎన్నికై సభ్యులు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రతినిధులు వారిని శాలువ, పూలదండతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన సభ్యులు మాట్లాడుతూ వచ్చే ఆషాఢ మాసంలో జరుపుకునే సింహవాహిణి బోనాల ఉత్సవాలను ప్రభుత్వ, అధికారుల, బస్తీవాసుల సహకారంతో ఘనంగా నిర్వహిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News