- Advertisement -
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. గచ్చిబౌలికి చెందిన సాయికిరణ్ రెడ్డి అనే యువకుడిని కారు డ్రైవర్ కిడ్నాప్ చేశాడు. గచ్చిబౌలి నుంచి రాజేంద్రనగర్ వచ్చే దారిలో పత్తికుంట చెరువు వద్ద ముగ్గురు యువకులను కారులో ఎక్కించుకొని కిడ్నాప్ కు పాల్పడినట్టు సమాచారం. కారు డ్రైవర్ భారీగా డబ్బులు డిమాండ్ చేశాడు. సాయికిరణ్ కారులో నుంచి దూకి చాకచక్యంగా పారిపోయాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
- Advertisement -