Sunday, December 22, 2024

ఏజెంట్ జాన్ స్నోగా నటకిరీటి

- Advertisement -
- Advertisement -

హీరో నితిన్ యూనిక్ యాక్షన్, హీస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ ’రాబిన్‌హుడ్’. శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. శుక్రవారం రాజేంద్ర ప్రసాద్ బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా బర్త్ డే విషెస్ అందిస్తూ రాబిన్‌హుడ్‌లో ఆయన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్.

ఏజెంట్ జాన్ స్నో అకా జనార్ధన్ సున్నిపెంటగా ఆయన క్యారెక్టర్ ని పరిచయం చేశారు. ఏజెంట్ గెటప్ లో ఆయన కనిపించడం చాలా ఆసక్తికరంగా వుంది. ఇందులో ఆయన క్యారెక్టర్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యున్నత స్థాయి ప్రొడక్షన్, టెక్నికల్ వాల్యూస్ తో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రానికి నిర్మాతలు. రాబిన్‌హుడ్ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20న విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News