- Advertisement -
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో గంజాయి స్మగ్లింగ్ ను పోలీసుల గుట్టురట్టు చేశారు. స్మగ్లర్స్ వద్ద నుంచి 6 కేజీల గంజాయి సీజ్ చేశామని రాజేంద్రనగర్ ఎస్ఒటి బృందం తెలిపింది. ఎస్ఒటి పోలీసులు 5 మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. చిన్న చిన్న ప్యాకెట్స్ లో గంజాయి ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నట్టు గుర్తించారు. గంజాయిని విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా ఎస్ఒటి పోలీసులు వారిని పట్టుకున్నారు. ఎన్ డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
- Advertisement -