Monday, December 23, 2024

వేర్వేరు రోడ్డు ప్రమాదాలు: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మైలార్‌దేవ్‌పల్లిలో కంటైనర్ బీభత్సం సృష్టించింది. లక్ష్మీగూడ వద్ద బైక్‌ను కంటైనర్ ఢీకొట్టడంతో మహిళ మృతి చెందింది. కంటైనర్ డ్రైవర్‌ను స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. మృతురాలు గోషామహల్‌కు చెందిన దుర్గాదేవిగా గుర్తించారు.
వరంగల్ జిల్లాలో ఖిలా వరంగల్‌లో క్రేన్ ఢీకొని మహిళ మృతి చెందింది. మృతురాలు సుమతిగా(70) గుర్తించారు. బాలరాజు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. రోడ్డు దాటుతుండగా వృద్ధులను క్రేన్ ఢీకొట్టింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఎంజె ఆస్పత్రికి తరలించారు.

Also Read:  టెన్నిస్ రారాజు జొకో

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News