- Advertisement -
రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ఉప్పరపల్లిలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపకయంత్రం అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఒక వైద్యురాలు మృతి చెందగా మరొక వైద్యుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -