మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలోనే అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ నిలిచింది. దేశంలోనే బెస్ట్ పిఎస్ ట్రోఫీని కేంద్ర హోం శాఖ శుక్రవారం ప్రదానం చేసింది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో జరిగిన అన్నిరాష్ట్రాల డిజిపిల సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతుల మీదుగా రాజేంద్రనగర్ పిఎస్ హౌస్ ఆఫీసర్ బి.నాగేంద్ర బాబు ట్రోఫిని అందుకున్నారు. పోలీసు స్టేషన్ల పని తీరుపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వేలో సైబరాబాద్ కమిషనరేట్‌కు చెందిన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ అత్యుత్తమ పోలీసు స్టేషన్‌గా నిలిచింది.
అత్యధిక కేసులు నమోదవుతున్న పోలీసుస్టేషన్‌గా కొన్నేళ్లుగా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ రికార్డు సృష్టించింది. కేసుల నమో దుతో పాటు విచారణ వేగవంతం చేసి, కేసులను ఛేదించడం, హత్య కేసుల్లో అత్యంత త్వరగా నిందితులను గుర్తించడం లాంటి పలు అంశాలల్లో ఈ పోలీసు స్టేషన్ పనితీరు, పోలీసుల ప్రతిభను కేంద్రం హోం శాఖ గుర్తించింది. జైపూర్‌లో జనవరి 5 నుంచి 7 వరకు జరగనున్న పోలీస్ ఉన్నతాధికారుల సమావేశంలో అవార్డును అందజేశారు. కేంద్రమంత్రి అమిత్ షా చేతుల మీదుగా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ సిఐ నాగేంద్ర బాబు బెస్ట్ పిఎస్ అవార్డు తీసుకున్నారు.
గత ఏడాది దేశ వ్యాప్తంగా బెస్ట్ పీఎస్ అవార్డు కోసం పరిశీలించగా సుమారు 17వేలకుపైగా పోలీస్ స్టేషన్ల పేర్లు వెళ్లాయి. అందులో మొదటగా 74 పోలీస్ స్టేషన్లను షార్ట్‌లిస్ట్ చేశారు. ఆ 74 పోలీసుస్టేషన్‌లలో మూడు ఉత్తమ పోలీస్ స్టేషన్లను ఎంపిక చేయగా తెలంగాణకు చెందిన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ అగ్రస్థానం దక్కించుకుంది. రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ తరువాత జమ్ముకాశ్మీర్‌కు చెందిన షేర్‌ఘరి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన సెరంపూర్ (చందన్‌నగర్ కమిషనరేట్) పోలీస్ స్టేషన్లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు సిఎం రేవంత్ రెడ్డి అభినందనలు
ఉత్తమ పోలీస్‌స్టేషన్‌గా రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ ఎంపిక కావడంపై సిఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎస్‌హెచ్‌ఓ బి.నాగేంద్రబాబుకు అభినందనలు తెలిపారు. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌కు మొదటి స్థానం రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. 2023లో దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిన పోలీస్ స్టేషన్‌గా మొదటి స్థానంలో నిలిచినందుకు డిజిపిల సమావేశంలో కేంద్ర హోంశాఖమంత్రి నుంచి ట్రోఫీని అందుకున్న రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు అభినందనలు అని ట్వీట్ చేశారు.
Cyberabad police commissionerate’s Rajendranagar police station #Hyderabad #Telangana adjudged the best performing police station in the country.
The 2023 list of best performers was announced at the 58th All-India conference of DGPs and IGPs being held in Rajasthan. (1/2) pic.twitter.com/CNdSxAb0Cb
— The Hindu-Hyderabad (@THHyderabad) January 5, 2024