- Advertisement -
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేపై కారు బీభత్సం సృష్టించింది. ముందు వెళుతున్న కారును స్కోడా కారు ఢీ కొట్టింది. రెండు కార్లలో ప్రయాణిస్తున్న వారికి స్వల్పంగా గాయపడ్డారు. ఎయిర్ బెలూన్స్ ఒపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. ట్రాఫిక్ జామ్ కావడంతో ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నామని ట్రాఫిక్ సిబ్బంది తెలిపారు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -