Tuesday, September 17, 2024

రాజేంద్రనగర్ లో 15 షెడ్లు కూల్చివేత

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: అక్రమార్కుల గుండెల్లో హైడ్రా దడ పుట్టిస్తుంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలో హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. రాజేంద్రనగర్ సర్కిల్ గగన్ పహాడ్ అప్పచెరువును వద్ద అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగిస్తుంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య షెడ్ ల నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. ఇప్పటివరకు 15 షెడ్లను తొలగించినట్టు సమాచారం. అప్పచెరువు మొత్తం విస్తీర్ణం 34 ఎకరాలు కాగా మూడు ఎకరాలు కబ్జా చేసి గోడౌన్లు నిర్మించినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. ఎఫ్ టిఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలను కూల్చివేయాలని హైడ్రా ఆదేశించిన విషయం తెలిసిందే.

శుక్రవారం రాంనగర్ మణెమ్మ వీధిలో రోడ్డును ఆక్రమించిన నిర్మించిన రెండు కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. గతంలో ఎఫ్ టిఎల్ పరిధిలో ఉన్న ఎన్ కన్వెషన్ కూల్చివేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News