Wednesday, January 22, 2025

రూ.17లక్షల హవాలా నగదు పట్టివేత

- Advertisement -
- Advertisement -

అక్రమంగా తరలిస్తున్న హవాలా డబ్బులను రాజేంద్రనగర్ ఎస్‌ఓటి పోలీసులు గురువారం రాత్రి పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.17,40,100 స్వాధీనం చేసుకున్నారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇద్దరు వ్యక్తులు హవాలా డబ్బులు తరలిస్తున్నారనే సమాచారం ఎస్‌ఓటి పోలీసులకు వచ్చింది. దీంతో పోలీసులు మైలార్‌దేవ్‌పల్లిలోని లబ్యాయ్ కాంటా ప్రాంతంలో వాహనాల తనిఖీ చేపట్టారు.

ఈ క్రమంలోనే బైక్‌పై వస్తున్న ఇద్దరు యువకులను ఆపారు. వారి బైక్‌ను సోదా చేయగా రూ.17,40,100 లభ్యమయ్యాయి. నగదుకు సంబంధించిన ఆధారాలు చూపించాలని కోరగా వారి విఫలమయ్యారు. దీంతో నగదును స్వాధీనం చేసుకుని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News