కూకట్‌పల్లి : భారతీయ జనతా పార్టీ కూకట్‌పల్లి సీనియర్ నాయకుడు వడ్డేపల్లి రాజేశ్వర్‌రావు తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా నియమితులైయ్యారు. ఈ మేరకు పార్టీ అదిష్ఠానం అందుకు సంబంధించిన ఆదేశాలను మంగళవారం జారీ చేసించి. రానున్న ఎన్నికల్లో తెలంగాణ రా ష్ర్టంలో గెలుపే ధ్యేయంగా పార్టీని మరింత బలోపేతం చేస్తూ మేడ్చల్ జిల్లాకు సంబంధించిన పలువురు సీనియర్లకు రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పారు.
కూకట్‌పల్లి నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తున్న రాజేశ్వర్‌రావుకు అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ పార్టీ తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతకు న్యాయం చేస్తూ పార్టీని మరింత బలోపేతం చేస్తానన్నారు. కేంధ్ర ప్రభుత్వ పధకాలను రాష్ట్ర వ్యాప్తంగా మరింత ప్రచారం చేసేందుకు కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా కూకట్‌పల్లి నియోజకవర్గంలో బిజెపి జెండా ఎగరడం ఖయమన్నారు. తనపై నమ్మకంతో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా అవకాశం కల్పించిన కేంద్ర, రాష్ట్ర పార్టీ నేతలకు ఈ సందర్భంగా రాజేశ్వర్‌రావు ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు.