- Advertisement -
హైదరాబాద్: తాను మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తానని బజెపి స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదివారం తెలిపారు. చౌటుప్పల్‌లో మీడియాతో మాట్లాడిన రాజ్‌గోపాల్‌రెడ్డి మునుగోడు ఉప ఎన్నికల్లో తనకు 87 వేలకు పైగా ఓట్లు వచ్చాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తాను బీజేపీకి రాజీనామా చేస్తానని కొందరు సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆ వార్తల్లో వాస్తవం లేదని అన్నారు.
- Advertisement -