Monday, December 23, 2024

రజనీకాంత్ ను అలా చూసి షాక్ అయిన అరవిందస్వామి

- Advertisement -
- Advertisement -

దేశంలోనే అత్యధిక పారితోషకం తీసుకునే నటుడిగా పేరు తెచ్చుకున్న సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నిజజీవితంలో దర్జాలకు, విలాసాలకు దూరంగా ఉంటారు. ఈ వయసులో కూడా యంగ్ హీరోలకు దీటుగా వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో ఆయన దూసుకుపోతున్నారు. నిజజీవితంలో ఎంతో సింపుల్‌గా ఉంటారు రజనీకాంత్. కానీ ఆయన ఏ స్థాయి నిరాడంబరతతో ఉంటారు అన్న విషయం తెలిస్తే మాత్రం షాక్ అవుతారు. రజనీకాంత్ నటించిన దళపతి సినిమాలో అరవిందస్వామి కూడా నటించారు.

ఇందులో అరవిందస్వామి రజినీకాంత్ తమ్ముడి పాత్ర పోషించారు. ఈ మూవీ తర్వాత అరవింద స్వామికి హీరోగా మంచి ఆఫర్లు కూడా వచ్చాయి. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో రజనీకాంత్ చేసిన పని చూసి అరవిందస్వామి షాక్ అయ్యారట. ఒకరోజు షూటింగ్ అయిన తర్వాత బాగా అలసిపోయిన అరవిందస్వామి తెలియకుండా రజనీకాంత్ గదిలోకి వెళ్ళాడు. అప్పటికే రూమ్ లో ఏసీ ఆన్ చేసి ఉండడంతో హ్యాపీగా మంచం పై పడుకొని హాయిగా నిద్రపోయాడు. తెల్లవారి లేచి చూసేసరికి అదే గదిలో నేలపై రజనీకాంత్ పడుకుని కనిపించారట.

కంగారుగా నిద్రలేచిన అరవిందస్వామి బయటకు వెళ్లి యూనిట్ సభ్యులను ఏం జరిగింది అని ఆరా తీస్తే.. గదిలోకి వచ్చి ఆదమరచి నిద్రపోతున్న అరవింద స్వామిని చూసిన రజనీకాంత్.. ‘అతన్ని లేపొద్దు.. అక్కడే పడుకోనివ్వండి’అని తన అసిస్టెంట్ డైరెక్టర్ తో చెప్పారట. అంతేకాదు నేల మీద పక్కా వేసుకొని పడుకొని నిద్రపోయారట. ఆ మాట విన్న అరవిందస్వామికి నిజజీవితంలో రజనీకాంత్ ఎంత నిరాడంబరంగా ఉంటారు అన్న విషయం అర్థమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News