Sunday, January 19, 2025

రజనీ-అమితాబ్ కొత్త చిత్రం ముంబై షెడ్యూల్ పూర్తి

- Advertisement -
- Advertisement -

వెబ్ డెస్క్: సూపర్ స్టార్ రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ నటిస్తున్న కొత్త చిత్రం ముంబై షెడ్యూల్ ఆదివారంతో పూర్తయ్యింది. సూర్య హీరోగా సంచలన విజయం సాధించిన జైభీమ్ చిత్ర దర్శకుడు టిజె జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న తలైవా 170 చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వినోదంతోపాటు సందేశాత్మకంగా కూడా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. నెల్సన్ దర్శకత్వంలో రజనీ నటించిన జైలర్ చిత్రం సూపర్ హిట్ కావడంతో రజనీ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

1991లో విడుదలైన హమ్ చిత్రం తర్వాత అమితాబ్, రజనీ మళీ 33 ఏళ్ల తర్వాత కలసి నటిస్తున్న ఈచిత్రం ముంబై షెడ్యూల్ అక్టోబర్ 25న ప్రారంభమైంది. అమితాబ్, రజనీ కాంబినేషన్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయినట్లు చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఎక్స్ వేదికగా ప్రకటించడంతోపాటు వీరి కాంబినేషన్ ఫోటోను కూడా విడుదలచేసింది. సుబాస్కరన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ క్రేజీ కాంబినేషన్ చిత్రంలో ఫాహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, మంజూ వారియర్, దుషారా విజయన్ తదితరులు నటిస్తున్నారు. నఅఇరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News