Sunday, December 22, 2024

ఒకే స్టూడియోలో కలసిన రజనీ-కమల్..

- Advertisement -
- Advertisement -

తమిళ సినీ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోలుగా వెలుగొందుతున్నారు కమల్ హాసన్. రజనీకాంత్. గత యాభైఏళ్లుగా టాప్ హీరోలుగా అభిమానులను అలరిస్తున్న ఈ హీరోలు తాజాగా ఒకే చోట కలిశారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో ఇప్పుడు ఇద్దరు హీరోల అభిమానులన్నీ అలరిస్తోంది.

కమల్, రజనీ ఒకే చోట కలవడానికి కారణం ఇద్దరూ ఒకే స్టూడియోలో షూటింగులో పాల్గొనడమే. స్టార్ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 సినిమాలో కమల్ నటిస్తున్నారు. రజనీ తన 170వ సినిమా షూటింగ్ లో  బిజీ బిజీ గా ఉన్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి టిజె జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇద్దరి షూటింగులూ ఒకే స్టూడియోలో జరుగుతున్నాయి. పక్కనే ఉన్న ఫ్లోర్ లో రజనీ ఉన్నారని తెలిసిన కమల్…రజనీ నటిస్తున్న సెట్లోకి వెళ్లి ఆయన్ని పలకరించారు. కాసేపూ ఇద్దరూ కలసి పిచ్చాపాటీ మాట్లాడుకున్నారు. తర్వాత ఎవరి సెట్లోకి వారు వెళ్లిపోయారు. అదీ సంగతి!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News