Monday, January 20, 2025

రజినీకాంత్ ‘కూలీ’ టీజర్ అదిరిపోయింది

- Advertisement -
- Advertisement -

సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్… స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ మూవీ రజినీకాంత్‌కు 171వ సినిమా. ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందించనున్నారు. అయితే సోమవారం ఈ పాన్ ఇండియన్ మూవీ టైటిల్‌ని ‘కూలీ’గా ఫిక్స్ చేసి టీజర్‌ని రిలీజ్ చేశారు ఫిల్మ్‌మేకర్స్.

గోల్డ్ బిస్కెట్స్, వాచెస్ స్మగ్లింగ్ చేసే ముఠా ఆటకట్టించి రజినీకాంత్ పవర్‌ఫుల్ ఎంట్రీ ఫైట్‌తో అదరగొట్టిన ఈ టీజర్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. త్వరలో కూలీ మూవీ రెగ్యులర్ షూట్ ప్రారంభంకానుంది. ఇక ప్రస్తుతం రజినీకాంత్ ‘వెట్టయాన్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీని టీజె జ్ఞానవేల్ తెరకెక్కిస్తుండగా… దీనిని అక్టోబర్‌లో ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News