Friday, December 20, 2024

రాజకీయాల్లోకి ఎందుకు రావడం లేదో చెప్పిన సూపర్ స్టార్..

- Advertisement -
- Advertisement -

తమిళ్ లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా తన స్టైల్, నటనతో ఎంతో అభిమానులను సంపాందించుకున్న రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలని వారు కోరుకున్నారు. రజినీ రాజకీయ ఎంట్రీ కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. అభిమానుల కోరికను అర్థం చేసుకున్న ఆయన తన రాజకీయ ఎంట్రీపై ప్రకటన కూడా చేశారు. “దేవుడు ఆదేశించాడు.. రాజకీయాల్లోకి వస్తున్నా” అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.దీంతో ఆయన అభిమానులు పండుగ చేసుకున్నారు. అయితే, ఇంతలోనే తాను ఎప్పటికీ రాజకీయాల్లోకి రానని ప్రకటించి అందరికీ సూపర్ స్టార్ షాకిచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా, తాను రాజకీయాల్లోకి ఎందుకు రావడం లేదనే విషయంపై ఎట్టకేలకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ క్లారిటీ ఇచ్చారు. పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమైన సమయంలో తనకు కరోనా వచ్చిందని, ఆరోగ్య పరిస్థితి రిత్యా ఆలోచించి అడుగువేయాలని వైద్యులు చెప్పారని.. దీంతో తాను రాజకీయాల్లోకి వచ్చేందుకు భయపడ్డానని ఆయన వెల్లడించారు. ఆరోగ్యం సహకరించకపోవడం వల్లే తాను రాజకీయాల్లోకి రాలేదని రజనీకాంత్ స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News