Saturday, January 18, 2025

రజనీకాంత్ ‘వెట్టియాన్’ వీడియో లీక్

- Advertisement -
- Advertisement -

జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న వెట్టయాన్ మూవీ మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ మూవీ ప్రస్తుతం తిరునల్వేలీలో షూటింగ్ జరుపుకుంటోంది. రజనీతోపాటు మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కూడా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన ఒక వీడియో లీకై, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో రజనీ, ఫాహద్ ఎవరితోనో మాట్లాడుతున్నట్లుగా ఉంది.

పూర్తి కమర్షియల్ కథాంశంతో రూపొందుతున్న వెట్టియాన్ ను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. రజనీ, ఫాహద్ ఫాజిల్ తోపాటు మరో రెండు ముఖ్యపాత్రలలో రానా దగ్గుబాటి, అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. వీరితోపాటు మంజూ వారియర్, రితికా సింగ్, దుషరా విజయన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News