Monday, November 25, 2024

సారీ..నాకేమీ తెలీదు : రజనీకాంత్

- Advertisement -
- Advertisement -

మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై హేమ కమిటీ నివేదిక సంచలనం కలిగించిన నేపథ్యంలో ఆ కమిటీ గురించి తనకేమీ తెలియదని సూపర్‌స్టార్ రజనీకాంత్ చెప్పడం చర్చకు దారి తీసింది.తలైవా అని అభిమానులచే మన్నన పొందిన రజనీకాంత్‌ను హేమ కమిటీ నివేదికపై మీ వైఖరి ఏమిటని ప్రశ్నించగా, సారీ ! నాకేమీ తెలియదు అని ఆయన పెదవి విరిచారు. ప్రస్తుతం హేమ కమిటీ నివేదికపై బాగా చర్చ జరుగుతోంది.అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్టు (అమ్మ) అధ్యక్ష పదవికి సూపర్‌స్టార్ మోహన్‌లాల్ తోపాటు మిగతా పాలక వర్గం కూడా ఈ నివేదిక ప్రభావంతో రాజీనామా చేశారు. జయసూర్య వంటి నటులుపై కేసులు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News