Wednesday, January 22, 2025

టి.జె. జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వంలో రజినీకాంత్ 170వ చిత్రం

- Advertisement -
సూపర్‌స్టార్ ర‌జినీకాంత్ 170వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. జై భీమ్ వంటి సూప‌ర్ హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు టి.జె.జ్ఞాన‌వేల్‌ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. నిర్మాత సుభాస్క‌ర‌న్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా త‌లైవ‌ర్ 170వ సినిమా అనౌన్స్‌మెంట్ చేశారు. ఈ మేర‌కు వారు ‘‘ఈరోజు మా చైర్మ‌న్ సుభాస్క‌ర‌న్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌గారి తలైవ‌ర్ 170వ సినిమాను మా బ్యాన‌ర్‌లో రూపొందించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించ‌టం ఆనందంగా ఉంది.
టి.జె.జ్ఞాన‌వేల్ ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్నారు. రాక్‌స్టార్ అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందించ‌నున్నారు. జి.కె.ఎం. త‌మిళ్ కుమర‌న్‌గారి నేతృత్వంలో త్వ‌ర‌లోనే ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తాం. అలాగే 2024లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తాం. ‘‘తలైవ‌ర్‌గారితో లైకా ప్రొడక్ష‌న్స్ సంస్థ‌కు ఉన్న అనుబంధం అంద‌రికీ తెలిసిందే. ఆయ‌నతో క‌లిసి ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను రూపొందించాం. ఆయ‌న‌తో ఉన్న అనుబంధం ఇలా కొన‌సాగ‌టాన్ని ఎంతో గౌర‌వంగా భావిస్తున్నాం. ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కులు సంతోష‌ప‌డేలా ఎన్నో గొప్ప‌గా ఈ సినిమాను రూపొందించ‌టానికి అంద‌రి ఆశీర్వాదాలు మాకు ఇవ్వండి’’ అంటూ నిర్మాణ సంస్థ ప్ర‌క‌టించింది.  సినిమాలో హీరోయిన్‌, ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ ఈ సంద‌ర్భంగా తెలియ‌జేశారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News