Thursday, January 23, 2025

రజనీకాంత్ సినిమాల్లో నటించడం మానేస్తారా?

- Advertisement -
- Advertisement -

చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల్లో నటించడం మానేస్తారంటూ సినీరంగంలో వార్త చక్కర్లు కొడుతోంది. ఆయనకు అభిమానుల గణం ఎంతో చెప్పనవసరంలేదు. ఇదివరలో కూడా ఆయన రాజకీయాల్లోకి వెళుతున్నానని అన్నప్పుడు అభిమానులు చాలా కలవరపడ్డారు. వారంతా ఆయన తన నటన ద్వారానే తమను అలరించాలని ఆశించారు. సినీ రంగంలోనే కొనసాగమని అభ్యర్థించారు. వారెప్పుడు తమ సూపర్ స్టార్‌ను వెండితెరపైనే చూడాలని కోరుకున్నారు.

సినీ రంగం నుంచి రజనీకాంత్ తప్పుకోవాలనుకుంటున్నారని ఇప్పుడు మళ్లీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 72 ఏళ్ల ఆయన సినీ రంగం నుంచి తప్పుకోబోతున్నారని పుకార్లు, రిపోర్టులు తెగ ప్రచారం అవుతున్నాయి. రజనీ కాంత్ చివరి చిత్రం(171 సినిమా) దర్శకుడు లోకేశ్ కనకరాజ్‌దేనని మరో తమిళ దర్శకుడు మిస్కిన్ ఓ ఇంటర్వూలో అన్నది ఇప్పుడు తెగ ప్రచారం అవుతోంది. కానీ నటుడు రజనీకాంత్ మాత్రం ఈ విషయాన్ని ఇంకా ధ్రువీకరించలేదు. తన వయస్సు మీదపడుతున్నందున ఆయన విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారని కొందరంటున్నారు. మరికొందరు ఆయన రాజకీయాల్లోకి వస్తారేమో అంటున్నారు.

నటుడు రజనీకాంత్ ఇటీవల ‘జైలర్’ సినిమా షూటింగ్ పూర్తిచేసుకున్నారు. ఆ సినిమా ఆగస్ట్ 11న విడుదల కానున్నది. అయితే రజనీకాంత్ సినీ రంగానికి నిజంగా దూరం కావాలనుకుంటున్నారా, లేక అంతా పుకారేనా అన్నది ఆయనే స్పష్టీకరించాల్సి ఉంది. అంత వరకు మనమంతా నిరీక్షిద్దాం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News