Wednesday, January 22, 2025

మెట్రో డిపోలో రజనీకాంత్ సందడి..సెల్పీలు దిగి ఖుష్ అయిన సిబ్బంది

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ మెట్రో డిపోలో ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ రజనీ కాంత్ సందడి చేశారు. నాగోల్ లోని ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ ను ఆయన సందర్శించారు. విద్యార్థులు, సాంకేతిక నిపుణులు ఎక్కువగా నాగోల్ ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ ను సందర్శిస్తుంటారు. ఓ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ కు వచ్చిన ఆయనను మెట్రో రైలు సంస్థ అభ్యర్థించగా నాగోల్ కి వెళ్లి కొంత సేపు అక్కడ గడిపారు. అక్కడి సిబ్బందితో ముచ్చటించారు. మెట్రోలో అత్యాధునిక సాంకేతిక వసతులు కల్పించడపై ఆయన అభినందించారు. ఎండి కెవిబి రెడ్డి, సిఓఓ సుధీర్, సిఎస్ఓ మురళీ మెట్రోపై రజినీ కాంత్ కు వివరించారు. తలైవాను చూసిన అక్కడి సిబ్బంది ఆయనతో సెల్పీలు దిగి ఫుల్ ఖుష్ అయ్యారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News