Wednesday, January 22, 2025

రజనీ సినిమా ‘కాలా’కు అరుదైన గౌరవం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ‘కాలా’ బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ విజయం సాధించకపోయినప్పటికీ ఆ సినిమాకు అరుదైన గౌరవం లభించింది. బ్రిటిష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్(బిఎఫ్ఐ) సైట్ అండ్ సౌండ్ మ్యాగజైన్ లో 21 వ శతాబ్దపు అత్యద్భుతమైన 25 చిత్రాల జాబితాలో ‘కాలా’కు స్థానం లభించింది. పైగా ఈ మ్యాగజైన్ లో స్థానం దక్కించుకున్న ఏకైక భారతీయ చిత్రంగా కీర్తిగాంచింది. ఈ సినిమాలో అధికారం కోసం జరిగే ఉన్నత, అణగారిన వర్గాల మధ్య పోరును వాస్తవికతకు దగ్గరగా చిత్రీకరించారు.

సినీ విశ్లేషకుల ఆధారంగా ఎంపిక చేసిన జాబితాలో రజనీకాంత్ ‘కాలా’ సినిమాకు గుర్తింపు రావడం హర్షణీయమే. 2000 నుంచి 2024 వరకు వచ్చిన సినిమాల్లో అత్యుత్తమ 25 సినిమాల్లో ఒకటిగా నిలిచింది. నివసించే నేలను దక్కించుకునే ధారవి(ముంబై) ప్రజల్లో కథానాయకుడు స్ఫూర్తిని నింపడం ఈ చిత్రంలోని ప్రధానాంశం.  సెంటిమెంట్లు, గ్యాంగ్ వార్, ప్రేమ భావన వంటివన్నీ ఈ సినిమాలో బాగా పండాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News