Monday, December 23, 2024

మాస్ ఫిల్మ్ ‘రామారావు ఆన్ డ్యూటీ’

- Advertisement -
- Advertisement -

Rajisha Vijayan said about Rama rao on duty

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్పీ, రవితేజ టీం వర్క్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’. రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈనెల 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ విడుదలకు సిద్ధమవుతోంది ఈ చిత్రం. ఈ సందర్భంగా చిత్ర హీరోయిన్‌లలో ఒకరైన రజిషా విజయన్ మీడియాతో మాట్లాడుతూ “ఈ సినిమాలో నేను మాళిని అనే పాత్రలో కనిపిస్తా. నా పాత్ర చాలా బలంగా వుంటుంది. ఒక భాషలో పరిచయమవుతున్నప్పుడు బలమైన కథ, పాత్ర కావాలని ఎదురుచూశాను. నేను ఎదురుచూసిన పాత్ర ఈ సినిమాతో దక్కింది. మాళిని పాత్ర చాలా అందంగా, బలంగా వుంటుంది. ఇంత మంచి సినిమాతో తెలుగులో పరిచయం కావడం ఆనందంగా వుంది.

హీరో రవితేజతో పని చేయడం గొప్ప అనుభవం. ఆయన గ్రేట్ మాస్ హీరో, సూపర్ స్టార్. దర్శకుడు శరత్ చాలా పర్ఫెక్షనిస్ట్. ఆయన చాలా క్లారిటీగా వుంటారు. ‘రామారావు ఆన్ డ్యూటీ’ మాస్ ఫిల్మ్. చాలా ఎంటర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్స్, యాక్షన్, డ్యాన్స్ వున్నాయి. అదే సమయంలో బలమైన కథ వుంది. వినోదం పంచుతూనే ఆలోచన రేకెత్తించే సినిమా ఇది. ఇన్ని ఎలిమెంట్స్ వున్న సినిమా తీయాలంటే దర్శకుడిలో చాలా క్లారిటీ ఉండాలి. అంత చక్కని క్లారిటీ వున్న దర్శకుడు శరత్‌”అని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News