- Advertisement -
నేడు నిమ్స్ లో ప్రారంభించనున్న సిఎం రేవంత్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుపై వేగం పెంచింది. నేడు అసెంబ్లీ ప్రాంగణం నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించి అనంతరం అక్కడి నుంచి నిమ్స్‌కు వెళ్లి ఆరోగ్యశ్రీ పథకం పారంభించనున్నారు.
మొదటి హామీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కాగా రెండోది రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించింది. ఇందులో భాగంగానే శనివారం సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా మహాలక్ష్మీ పథకంతో పాటు ఆరోగ్య శ్రీ ప్రారంభించనుంది.
- Advertisement -