Monday, January 6, 2025

రేపు ప్రజా భవన్‌లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో ఆదివారం ఉదయం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరు కానున్నారు. అనంతరం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తంలో భాగంగా సివిల్స్ ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థులకు రూ.లక్ష అందించనున్నారు. సివిల్స్ మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటి ఇంటర్వ్యూలకు సిద్ధమవుతున్న పేద విద్యార్థులకు ఈ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం అర్ధికంగా తోడ్పడనుంది. అయితే ఆగస్టు నెలలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో 135 మంది తెలంగాణ అభ్యర్థులకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించిన విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News