Saturday, September 14, 2024

రాజీవ్ సూచనలతోనే హైదరాబాద్‌లో ఐటి రంగానికి పునాది: భట్టి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సూచనలతోనే హైదరాబాద్‌లో ఐటి రంగానికి పునాది పడిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. దేశ ప్రగతికి రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారని, దేశంలో టెక్నాలజీని రాజీవ్ విస్తృతం చేశారని కొనియాడారు. సోమాజిగూడలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి సిఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ, విహెచ్, మేయర్ విజయలక్ష్మి, జగ్గా రెడ్డి, పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడారు.  హైదరాబాద్ ఐటి రంగానికి రాజీవ్ పునాదాలు వేశారన్నారు.

రాజీవ్ కృషితో మాదాపూర్‌లో ఐటి రంగం అభివృద్ధి చెందిందన్నారు. డ్రింకింగ్ వాటర్ మిషన్ టెక్నాలజీని రాజీవ్ గాంధీ తీసుకొచ్చారని, హైడ్రా ద్వారా హైదరాబాద్‌లో ఆక్రమణలు తొలగిస్తామన్నారు. పదేళ్లలో లక్ష రుణమాఫీ కూడా బిఆర్‌ఎస్ చేయలేదని,  రైతు రుణమాఫీపై బిఆర్‌ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని  భట్టి దుయ్యబట్టారు. ఎనిమిది నెలల్లోనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి చూపించామని, ధరణిపై అసెంబ్లీలో విస్తృతంగా చర్చించామని, గతంలో కాంగ్రెస్ పేదలకు భూములు పంచిందని భట్టి గుర్తు చేశారు. సిఎం రేవంత్ విదేశీ పర్యటనలతో తెలంగాణకు భారీగా పెట్టుబడులు వచ్చాయని, కోటలు, గడీల్లో కూర్చొని ఒప్పందాలు చేసుకోవడం లేదని చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News