రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జిఐఏ) గ్లోబల్ గుర్తింపు పొందింది. ఎయిర్‌పోర్టు కార్బన్ అక్రెరేడిటేషన్ (ఏసిఏ) ప్రోగ్రాంలో అత్యున్నతమైన లెవల్ 5 కార్బన్ అక్రెడిటేషన్‌ను ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్‌తో ఈ గుర్తింపును దక్కించుకుంది. విమానాశ్రయాలు తమ కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలను అంచనా వేయడానికి ఈ ఏసిఏ ప్రోగ్రాం స్టాండర్డ్‌గా పరిగణిస్తారు. ఇందులో మొత్తం ఏడు స్థాయులు ఉంటాయి. లెవల్ ఒకటిలో మ్యాపింగ్, లెవల్ 2లో రిడక్షన్, లెవల్ 3లో ఆప్టిమైజేషన్, లెవల్ 3+లో న్యూట్రాలిటి, లెవల్ 4లో ట్రాన్స్‌ఫార్మేషన్ , లెవల్ 4+లో ట్రాన్సిషన్, అత్యున్నతమైన లెవల్ 5 గుర్తింపు ఇస్తారు. ఈ లెవల్ 5 గుర్తింపులో భాగంగా జిహెచ్‌ఐఏఎల్ విమానాశ్రయం ఏసిఐ ఆసియా-పసిఫిక్ అండ్ మిడ్లీస్ట్ ప్రాంతంలో ఈ స్థాయిని పొందిన టాప్ నాలుగు విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిపింది. ఇది ఆర్‌జిఐఏ గ్లోబల్ క్లైమేట్ గోల్స్‌తో అనుసంధానమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుందని శంషాబాద్ విమానాశ్రయ అధికారులు తెలిపారు.
స్రోప్ 1, స్రోప్ 1లో భాగంగా కార్బన్ ఉద్గారాలను నెట్ జీరో స్థాయిలో కొనసాగించడమే కాకుండా, 2050 లేదా అంతకంటే ముందే స్రోప్ 3లో ఉద్గారాలను నెట్ జీరోగా మార్చే దిశగా ఈ ఎయిర్‌పోర్టు కృషి చేసిందని ఏసిఏ ప్రోగ్రాం తన స్టాండర్డ్‌తో పేర్కొంది. ఈ సందర్భంగా జిఎంఆర్ ఎయిర్‌పోర్ట్ ఈడి అండ్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్, ఏసిఐ ఆసియా పసిఫిక్ అండ్ మిడ్లీస్ట్ ప్రెసిడెంట్ ఎస్‌జికె కిషోర్ మాట్లాడుతూ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ స్క్రోప్1 & 2 ఉద్గారాలను నెట్ జీరోగా ఉంచేందుకు కృషిని చేస్తూనే, స్క్రోప్ 3 నెట్ జీరో లక్ష్యాన్ని 2050 నాటికి సాధించేందుకు స్టేక్హోల్డర్లతో కలిసి పనిచేస్తుందన్నారు. ఏసిఐ ఆసియా పసిఫిక్ అండ్ మిడ్లీస్ట్ డైరెక్టర్ జనరల్ స్టెఫానో బారోన్సీ మాట్లాడుతూ పర్యావరణ స్థిరత్వంలో భారతీయ విమానాశ్రయాలు ముందుండటం గర్వకారణమన్నారు.