న్యూఢిల్లీ: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. 31 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవించిన పెరరివాలన్ విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 1991, మే 21న శ్రీ పెరంబుదూర్ ఎన్నికల ర్యాలీలో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. రాజీవ్ గాంధీని హత్య చేసేందుకు పెరరివాలన్ బాంబులో బ్యాటరీలు అమర్చాడు. 1998లో పెరరివాలన్ రాజీవ్ హత్య కేసులో దోషిగా తేలుస్తూ టాడా కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ హత్య కేసులో మొత్తం ఏడుగుర నిందితులకు మరణశిక్ష విధించింది. అనంతరం, 2014లో ఏడుగురు నిందితులు క్షమాభిక్ష కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో సుప్రీం నిందితులను జీవిత ఖైదీలుగా మార్చింది. తర్వాత పెరరివాలన్ కు 2022 మార్చిలో సుప్రీం బెయిల్ మంజూరు చేసింది. క్షమాభిక్ష కోసం తమిళనాడు గవర్నర్ కు విజ్ిప్తి చేశాడు. అయితే, పెరరివాలన్ క్షమాభిక్షపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోలేదు. దీంతో పెరరివాలన్ సుప్రీంకోర్టులో విడుదల పిటిషన్ దాఖలు చేశాడు. ఈనేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద పెరరివాలన్ ను జైలు నుంచి విడుదల చేయాలని సుప్రీకోర్టు ఆదేశించింది.
Rajiv Gandhi Murder Case: SC Orders to release Perarivalan