Tuesday, January 7, 2025

రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలి

- Advertisement -
- Advertisement -

అన్ని జిల్లాలకు జాతీయ రహదారులతో అనుసంధానం చేయాలి
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ లేఖ

Rajiv Road should be developed as a national highway

మనతెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలోని 33 జిల్లాలకు జాతీయ రహదారులతో అనుసంధానం చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డికి రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ లేఖ రాశారు. సోమవారం ఆయన కేంద్ర మంత్రికి రాసిన లేఖలో హైదరాబాద్ నుంచి సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి మీదుగా రామగుండం వెళ్లే రాజీవ్ రహదారిని స్టేట్ హైవే నుంచి నేషనల్ హైవే గా అప్ గ్రేడ్ చేయాలని కోరారు. ఈ రహదారిలో వాహనాల రాకపోకలు పెరిగి రద్దీగా మారడమే కాకుండా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు.

జాతీయ రహదారిగా రాజీవ్ రహదారిని అప్ గ్రేడ్ చేయాలని, మహారాష్ట్ర లోని చంద్రపూర్, నాగ్ పూర్ వరకు రాజీవ్ రహదారిని విస్తరించాలని కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా -2019లో పార్లమెంటులో ప్రస్తావించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 30 లో పేర్కొన్న విధంగా తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులను మరింత అభివృద్ధి చేయాలని, మారుమూల ప్రాంతాలకు కూడా రహదారి కనెక్టివిటీ పెంచాలని కోరారు.

రాష్ట్రానికి నేషనల్ హైవే కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయాలని తనతోపాటు సహచర టిఆర్‌ఎస్ ఎంపిలు అప్పటి కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరామని, సూత్రప్రాయంగా అంగీకారాన్ని తెలిపి ఇప్పటికీ ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదని వినోద్‌కుమార్ తెలిపారు. రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా గుర్తించి అభివృద్ధి చేస్తే పెద్దపల్లి జిల్లాకు జాతీయ రహదారి కనెక్టివిటీ కలుగుతుందని అన్నారు. ఈ అంశాలపై కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలని, రాష్ట్రానికి సముచిత న్యాయం జరిగేలా కృషి చేయాలని వినోద్ కుమార్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News